ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:49:16

సాగుకు అధిక ప్రాధాన్యం

సాగుకు అధిక ప్రాధాన్యం

మంత్రి నిరంజన్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ది అభివృద్ధి ఆరాటం: మంత్రి కొప్పుల

జగిత్యాల, జనవరి 22 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలిచిందని, మరే రాష్ట్రం మనకు సాటి రాదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతల అభ్యున్నతికి అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని చెప్పా రు. పంటల దిగుబడిలో రాష్ర్టాన్ని అగ్రగామి గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. మల్లాపూర్‌ మండలం దాంరాజ్‌పల్లి, మల్లాపూర్‌, మొగలిపేట, ఇబ్రహీంపట్నంలో  రైతు వేదికలు, మల్లాపూర్‌లో మార్కెట్‌ కమిటీ భవనాన్ని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఆయా చోట్ల నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఏ దేశమైనా తమకు అనుకూలమైన రంగంతోనే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సకల సౌకర్యాలతో రైతు వేదికల నిర్మాణానికి అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజల మెప్పు పొందకుండా అబద్ధాలు చెప్తూ అధికారాన్ని దక్కించుకొనేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరాట పడితే, ప్రతిపక్షాలు అధికారం కోసం పాకులాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo