శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 07:28:14

ఐటీ కారిడార్‌లో నో కోవిడ్‌-19 పర్యవేక్షణకు హైపవర్‌ కమిటీ

ఐటీ కారిడార్‌లో నో కోవిడ్‌-19 పర్యవేక్షణకు హైపవర్‌ కమిటీ

సైబరాబాద్  :  సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో కోవిడ్‌-19 పట్ల గందరగోళం లేకుండా ఉండేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖలను కలుపుకొని హైపవర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుకార్లతో గందరగోళానికి గురికాకుండా వాటిని నిర్ధారించుకునేందుకు పాటించాల్సిన అంశాలు, ఒక వేళ అనుమానం ఉంటే ఆ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఓ నిర్ధారిత ప్రక్రియ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌)ను రూపొందించారు.  దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ విడుదల చేశారు. 

హైపవర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు

* సజ్జనార్‌ పోలీసు కమిషనర్‌ సైబరాబాద్‌, కోవిడ్‌-19 ఐటీ కారిడార్‌ నోడల్‌ అధికారి

* డాక్టర్‌ శ్రీనివాస్‌, డైరెక్టర్‌ వైద్య ఆరోగ్య శాఖ

* రవికిరణ్‌, జోనల్‌ కమిషనర్‌ పశ్చిమండలం, జీహెచ్‌ఎంసీ

* మురళి, హెచ్‌వైఎస్‌ఈఏ అధ్యక్షుడు

* కృష్ణ ఏదుల, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి 

* శ్రీకాంత్‌ శ్రీనివాసన్‌, నాస్కామ్‌ రీజినల్‌ డైరెక్టర్‌ 

* అమరనాథ్‌ , ఐటీఈఅండ్‌సీ సీఆర్‌ఓ 

* వినోద్‌కుమార్‌, జోనల్‌ మేనేజర్‌ టీఎస్‌ఐఐసీ సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ నిత్యం తాజాగా నెలకొంటున్న పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన సందర్భాల్లో కార్పొరేట్‌ కార్యాలయాలకు సూచనలు ఇస్తుంది. 

కమిటీ రూపొందించిన మార్గదర్శకాలు

* ఐటీ కంపెనీలు, ఐటీ పార్క్స్‌ కార్పొరేట్‌ కార్యాలయాల నిర్వహకులు, ఉన్నతాధికారులు ఎప్పుడైనా స్పష్టంగా నిర్ధారించుకోకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. ఒకటికి పదిసార్లు పరిశీలించుకుని విషయాన్ని ధ్రువీకరించుకోవాలి.

* కోవిడ్‌-19 అనుమానం ఉంటే వెంటనే డయల్‌ 104కు సమాచారం అందించండి. అదే విధంగా సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సంప్రదించండి. 

* ఒక వేళ కోవిడ్‌-19 అని వైద్య రిపోర్టులో తేలితే వెంటనే ఎస్‌సీఎస్‌సీ (9000257058)కి సమాచారం అందించాలి. జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించి ఆ ప్రాంతంలో డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రక్రియను చేపట్టాలి. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ నం.ఎపిడెమిక్‌ సెల్‌-డాక్టర్‌ లలిత 9849902438 లేదా డాక్టర్‌ జనార్దన్‌  8008456677 లను సంప్రదించాలి.

* హై పవర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఐటీ కారిడార్‌లో నెలకొన్న తాజా పరిస్థితిని పర్యవేక్షించింది. ఎలాంటి గందరగోళం లేకుండా అందరూ ప్రశాంతంగా తమ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చని తెలిపింది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫర్‌ హోమ్‌ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అది వారి సొంత నిర్ణయమని కమిటీ తెలిపింది. అలా సౌకర్యం కల్పించే కంపెనీలు ఆ సమాచారాన్ని నోడల్‌ అధికారికి, ఎస్‌సీఎస్‌సీకి అందజేయాలని కమిటీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.   


logo