మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 22:45:49

మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ..

మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ..

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2020ని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం.. మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే విషయం విదితమే. అందుకు గాను ముందస్తు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం.. 11 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నది. 

ఈ కమిటీలో చైర్మన్‌గా మంత్రి సత్యవతి రాథోడ్‌, వైస్‌ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వి. రమణాచారి, సెక్రటరీగా స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, కన్వీనర్‌గా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సభ్యులుగా.. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అరుణ బహుగుణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్‌ క్రిస్టినా, సమచారం హక్కు చట్టం కమిషనర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి, ది హిందూ దినపత్రిక డిప్యూటీ రెసిడెంట్‌ ఎడిటర్‌ చింతల ప్రశాంత్‌ రెడ్డి, జెఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ వీసీ కవిత దర్యారి రావు, ఆర్టిస్ట్‌ సురభి, తెలుగు విశ్వవిద్యాలయం డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రొ. కె. సువర్చల, ఉర్దూ కవయిత్రి తన్సీమ్‌ జొహార్‌ నియమితులయ్యారు. 


logo
>>>>>>