శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 08:26:24

శ్రీశైలానికి పొటెత్తుతున్న వరద.. గరిష్ఠస్థాయికి నాగార్జునసాగర్‌ నీటిమట్టం

శ్రీశైలానికి పొటెత్తుతున్న వరద.. గరిష్ఠస్థాయికి నాగార్జునసాగర్‌ నీటిమట్టం

నల్లగొండ : కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు కృష్ణా ప్రాజెక్టులకు వరద పొటెత్తుతోంది. ఇప్పటికే అన్నిప్రాజెక్టులు నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల నుంచి 5,19,713 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 10 క్రస్టుగేట్లను 25 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు 5,95,775 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8070) టీఎంసీలు కాగా ప్రస్తుతం 884.20 అడుగులు (210.99) టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. 

నిండుకుండలా తొనికిసలాడుతున్న నాగార్జునసాగర్‌..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా తొనికిసలాడుతోంది. ఎగువ శ్రీశైలం వైపు నుంచి 4,10,978 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,68,630 క్యూసెక్కులను స్పిల్‌ వే ద్వారా నదిలోకి విడుదల చేస్తున్నారు.  విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా  28,095 క్యూసెక్కులు, కుడికాల్వకు 8,604 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 3,549 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకీ 1800, లోలెవ్‌ కెనాల్‌కు 5300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



logo