శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:10

కరోనా వైద్యానికి అధిక ఫీజులా?

కరోనా వైద్యానికి అధిక ఫీజులా?

  • 9154170960కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయండి 
  • పడకల వివరాలు తెలిపేలా డ్యాష్‌ బోర్డు : వైద్యారోగ్యశాఖ   

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘కరోనా చికిత్స కోసం ప్రైవేటు దవాఖానకు వెళ్లారా? ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారా? మా నెంబర్‌కు వాట్సాప్‌ చేయండి’ అంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేటు దవాఖానలపై ఫిర్యాదులు వస్తుండటంతో కట్టడికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రంగంలోకి దిగింది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబర్‌ 9154170960 ని ఏర్పాటు చేసింది. చికిత్స, పడకల కత్రిమ కొరత, అధిక బిల్లులు తదితర సమస్యలు, ఫిర్యాదులను వాట్సప్‌ ద్వారా తెలియజేయాలని సూచించింది. దీంతో పాటు ప్రభుత్వ కొవిడ్‌ దవాఖానల్లో పడకల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు డ్యాష్‌ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాస్‌రావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ వివరాలు తెలుసుకునేలా పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.  


logo