గురువారం 09 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 03:41:17

ఆధారాలు లేకుండా ఆదేశాలివ్వలేం

ఆధారాలు లేకుండా ఆదేశాలివ్వలేం

  • ఫర్మానాలు జారీచేయడానికి మేం నవాబులం కాదు
  • షెల్టర్‌హోంల ఎత్తివేతపై అఫిడవిట్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎటువంటి వివాదానికైనా ఆధారాలు, రికార్డులు లేకుండా తాము ఆదేశాలు జారీచేయలేమని, చెప్పే ప్రతి మాట, ఆరోపణ.. అఫిడవిట్‌ రూపంలో ఉం డాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆశ్రయం కోల్పోయి రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై ఉంటున్న నిరాశ్రయులను షెల్టర్‌ హోంలకు తరలించాలని న్యాయవాది ఎస్‌ నందా, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫర్మానాలు జారీచేయడానికి తా ము మొఘల్‌ నవాబులం కాదని, దేనికైనా ఆధారాలు, రికార్డులు ఉండాలని, తాము జారీచేసేది ఫర్మానాలు కాదని, జ్యుడిషియల్‌ ఆర్డర్స్‌ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ చెప్పే అంశాలపై అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. వృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టం కింద ఏర్పాటైన వృద్ధాశ్రమాలపై వివరణ ఇవ్వాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను జూలై ఐదుకు వాయిదా వేసింది.logo