గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:27:02

స్కూల్‌ ఫీజులపై సమగ్ర విధానం

స్కూల్‌ ఫీజులపై సమగ్ర విధానం
  • ఏప్రిల్‌ 8లోగా రూపొందించాలి
  • ఫీజుల నియంత్రణ అధికారం రాష్ర్టానిదే..
  • ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్‌ 8లోగా ఓ విధానంతో ముందుకురావాలని సూచించింది. తెలంగాణ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ క్యాపిటేషన్‌ ఫీ యాక్ట్‌ - 1983 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టంచేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రతిఏటా భారీగా ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకి స్తూ తల్లిదండ్రుల సంఘాలు, ఫోరం అగెనెస్ట్‌ కరప్షన్‌ తదితర సంస్థలు హైకోర్టులో పిల్‌వేశాయి. అలాగే ప్రైవేటు పాఠశాలలు కూడా తాము అందిస్తున్న సేవలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని, తమకు నష్టాలు రాకుండా ఫీజులు నిర్ణయించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. 


ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రైవేటు పాఠశాలలు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేలా ఒక విధానాన్ని రూ పొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని చెప్పారు. ఆ కమిటీ చేసిన సిఫారసులపై నిర్ణ యం తీసుకొని, సమగ్ర విధా నం రూపొందించాలని ధర్మాసనం పేర్కొంది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని ఏజీ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సమ్మతించిన న్యాయస్థానం ఏప్రిల్‌ 8లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అంతవరకు వేచిచూడాలని పిటిషనర్లకు సూచించింది. ప్రభు త్వం రూపొందించే విధానంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ తరువాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.


logo
>>>>>>