మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 15:18:53

విజయవాడ నగరంలో హై అలర్ట్‌: సీపీ

విజయవాడ నగరంలో హై అలర్ట్‌: సీపీ

విజయవాడ: నగరంలో కరోనా పాజిటీవ్‌ రావడంతో సిటీని హై అలర్ట్‌ చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సిటీలో 144 సెక్షన్‌ విధించాం. మా వైపు నుంచి అన్ని చర్యలు తీసుకున్నాం. విజయవాడలో కరోనా వచ్చిన వ్యక్తి ప్రయాణించిన కారులో గుంటూరుకు చెందిన మరో ముగ్గురు ప్రయాణించారు. విజయవాడ నుంచి గుంటూరు ప్రయాణించిన ప్రయాణికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. స్వచ్ఛందంగా ముందుకు రావాలి. స్వచ్ఛందంగా ప్రజలు గుమికూడకుండా సహకరించాలి. లేదంటే నిర్భందంగా అయిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


logo
>>>>>>