సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 25, 2021 , 11:52:55

వ‌న‌ప‌ర్తి జిల్లాలో గుప్త నిధులు?

వ‌న‌ప‌ర్తి జిల్లాలో గుప్త నిధులు?

వ‌న‌ప‌ర్తి : వ‌న‌ప‌ర్తి జిల్లాలో గుప్త నిధులు ఉన్నాయ‌న్న వార్త స్థానికంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కొత్త‌కోట మండ‌లం పాత జంగ‌మ‌య్య‌ప‌ల్లి పాత‌గుట్ట‌పై గుప్త నిధుల కోసం ఆదివారం అర్ధ‌రాత్రి త‌వ్వ‌కాలు జ‌రిపిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌వ్వ‌కాలు జ‌రిపి వెళ్లిన‌ట్లు గ్రామ‌స్తులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పాత జంగ‌మ‌య్య‌ప‌ల్లి పాత‌గుట్ట‌ను పోలీసులు ప‌రిశీలించే అవ‌కాశం ఉంది. త‌వ్వ‌కాలు జ‌రిపిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

VIDEOS

logo