బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 13:30:35

వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ రూ. 10 కోట్లు విరాళం

వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ రూ. 10 కోట్లు విరాళం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ అండ‌గా నిలిచింది. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించింది హెటిరో డ్ర‌గ్స్. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 కోట్లు విరాళం అందించిన‌ట్లు హెటిరో డ్ర‌గ్స్ చైర్మ‌న్ పార్థ‌సార‌థి రెడ్డి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆయా రాష్ర్టాల‌తో పాటు ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు సీఎంఆర్ఎఫ్‌కు భారీగా విరాళాలు అందించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఒకరోజు మూలవేతనం సుమారు రూ.33 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేందుకు ముందుకొచ్చింది.