శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 17:18:16

మైసమ్మతల్లి సన్నిధిలో హీరో షకలక శంకర్‌

మైసమ్మతల్లి సన్నిధిలో హీరో షకలక శంకర్‌

రంగారెడ్డి : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని గురువారం మధ్యాహ్నం సినీ హీరో, జబర్దస్త్‌ ఫేం షకలక శంకర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన దర్శక, నిర్మాతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను హీరోగా నటిస్తున్న సినిమా ఘన విజయం సాధించాలని దర్శక, నిర్మాతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నామని తెలిపారు. సినిమాకి సంబంధించి క్లాప్‌ని అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయించిన్నట్లు శంకర్‌ తెలిపారు. అనంతరం శంకర్‌తోపాటు సినిమా టీం సభ్యులను ఆలయ నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది యాదగిరిస్వామి, చంద్రయ్య, దేవేందర్‌, బోడ్కనాయక్‌, శ్రీనివాస్‌, పార్థునాయక్‌, విజయ్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
logo