హైదరాబాద్, అక్టోబర్ 14: హీరో మోటోకార్ప్.. తమ కస్టమర్లకు ఆకర్షణీయ రిటైల్ ఫైనాన్స్ స్కీములను పరిచయం చేసింది. ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వాహన కొనుగోళ్లపై నోకాస్ట్ ఈఎంఐ, క్యాష్ ఈఎంఐ (బ్యాంక్ ఖాతా లేకుండానే రుణం)లను ఆఫర్ చేసింది. తొలిసారిగా కిసాన్ ఈఎంఐ అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ ఆధారిత కస్టమర్లు, సీజనల్ ఆదాయమున్నవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని హీరో ఓ ప్రకటనలో తెలిపింది. ఆధార్ ఆధారిత ఫండింగ్, కనిష్ఠంగా 5.55 శాతం వడ్డీ, నాలుగేండ్ల వరకు కాలపరిమితి సదుపాయంతోపాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో వాహనాలను కొన్నవారికి ఇన్స్టంట్ మనీ లాభాలుంటాయని వెల్లడించింది.