శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 21, 2020 , 09:47:49

సికింద్రా‌బాద్‌‌ నుంచి క‌దిలే రైళ్లు ఇవే..

సికింద్రా‌బాద్‌‌ నుంచి క‌దిలే రైళ్లు ఇవే..

తెలంగాణ నుంచి క‌దిలే రైళ్లు ఇవే..


హైద‌రాబాద్‌: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు ఇవాళ‌ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమంకానున్న‌ది. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటా యి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు  ఉన్నాయి.  సికింద్రాబాద్‌, నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ల నుంచి కొన్ని రైళ్లు క‌ద‌ల‌నున్నాయి.  వాటి జాబితా ఇదే. 

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వ‌చ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబై నుంచి హైదరాబాద్ మ‌ధ్య న‌డిచే హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మ‌ధ్య న‌డిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా నుంచి సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే ఫలక్‌ను మా ఎక్స్‌ప్రెస్‌,  సికింద్రాబాద్ నుంచి డనపూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌, గుంటూరు నుంచి సికిం ద్రాబాద్ మ‌ధ్య న‌డిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి నిజామా బాద్ మ‌ధ్య న‌డిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు ఇవాళ ఉద‌యం నుంచి రిజ‌ర్వేష‌న్ టికెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు.logo