శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 17:12:17

హేమంత్ హ‌త్య‌.. 10 ల‌క్ష‌ల సుపారీ

హేమంత్ హ‌త్య‌.. 10 ల‌క్ష‌ల సుపారీ

హైద‌రాబాద్ : చ‌ందాన‌గ‌ర్‌కు చెందిన హేమంత్ హ‌త్య కేసు రాష్ర్ట వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. హేమంత్ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు యుగంధ‌ర్‌తో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హేమంత్ హ‌త్య కోసం ఇద్ద‌రు కిరాయి వ్య‌క్తుల‌కు రూ. 10 ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్లు యుగంధ‌ర్ తెలిపాడు. చందాన‌గ‌ర్‌కు చెందిన ఇద్ద‌రు కిరాయి వ్య‌క్తులు పరారీలో ఉన్నారు. హేమంత్ భార్య అవంతిక మేన‌మామ‌నే యుగంధ‌ర్‌. నిన్న యుగంధ‌ర్ స్వ‌యంగా హేమంత్‌, అవంతిక నివాస‌ముంటున్న ప్రాంతానికి వెళ్లి వారిద్ద‌రిని బ‌ల‌వంతంగా కారులో ఎక్కించుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఔట‌ర్ రింగ్ రోడ్డుపైకి తీసుకెళ్తుండ‌గా.. యువ జంట ఇద్ద‌రు కారులో నుంచి దూకారు. దీంతో అవంతిక‌ను అక్క‌డే వ‌దిలిపెట్టి యుగంధ‌ర్ మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో త‌న కారులో హేమంత్‌ను తీసుకెళ్లి హ‌త్య చేశారు.


logo