శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 16:41:52

గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌తో చెడుకు అడ్డుకట్ట

గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌తో చెడుకు అడ్డుకట్ట

లాక్‌డౌన్‌లో చిన్నారుల ఫోన్‌ వాడకంలో జాగ్రత్తలు

ఎప్పటికప్పుడు పర్యావేక్షణ

వయసుకు మంచి అనవసర సైట్ల కట్టడి

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో విదించిన లాక్‌డౌన్‌ ఫలితంగా చాలా మంది చిన్నారులు చదువులకు తమ ఇంట్లో ఉండే సెల్‌పోన్‌లను లేదా ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. దీంతో పాటు కాలక్షేపానికి కూడా చిన్నారులు ఎక్కువగా మొబైల్‌ ఫోన్లు వాడుతున్నరు. ప్రతి ఇంట్లో దాదాపు పెద్దలకు ఉండే ఫోన్‌లు కాకుండా చిన్నారులకు అదనంగా ఇంట్లో ఉన్న ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. దీంతో చిన్నారులు తమ చదువులకు, విఙ్ఞానానికి మించి ఇతర కాలక్షేపాలకు కూడా ఫోన్‌ వాడకానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో చిన్నారుల మొబైల్‌ వాడకం అంతకంతకు పెరిగిపోయింది. కాలక్షేపం, విద్య, వినోదం అంటూ పబ్జీ, లూడో వంటి ఆటలు ఎన్నో ఆడుతున్నారు చిన్నారులు. ఇక వీటితో ఆగితే పరవా లేదు కానీ చిన్నారులు అక్కడితో ఆగడం లేదు వాటికి మించి వారు మొబైల్‌ను వాడుతున్నారు. తమ మొబైల్‌ ద్వారా వారు తమ వయసుకు మించిన కాంటెంట్‌ చూస్తున్నారు. ఇక అటువంటి వాటి నుండి చిన్నారులను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

నేడు అంతర్జాలం ద్వారా చిన్నారులను కొన్ని రకాల ప్రకటనలు వారి మనసును చెడు బాటలోకి తీసుకెళ్ళే ప్రమాదం లేకపోలేదు. లాక్‌డౌన్‌లో మొబైల్‌ వాడకం చిన్నారుల్లో అటువంటి చెడు వైపు వెళ్ళే అవకాశాలను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి దీనికి చిన్నారులు చెడు మార్గాల వైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పెద్దలపై ఉంది. 

చిన్నారుల వద్ద పెద్దలు నిరంతరం లేకున్నా వారు వాడుతున్న మొబైల్‌ లేదా ట్యాబ్‌పై నిరంతరం పర్యావేక్షణ చేయగలిగే అవకాశం గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌ సదుపాయంతో పెద్దలకు ఉంది. సాదారణంగా గూగుల్‌ ప్రతి ఒక్కరికి వారి వయసుకు తగ్గట్టు యాప్‌లను, కాంటెంట్‌ను అందిస్తుంది. కానీ సాదారణ పద్దతులతో చిన్నారులకు జీమేయిల్‌ తయారు  చేసుకునేందుకు వీలు ఉండదు. అలాంటప్పుడు వారు తమ వయసును తప్పుగా పేర్కొంటూ జీమేయిల్‌ క్రియేట్‌ చేసుకుని వాడుతుంటారు. దీంతో పెద్ద వారికి వచ్చే కాంటెంట్‌ అంతా వారికి కూడా గూగుల్‌ అందిస్తుంది. అయితే గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభించే ఈ యాప్‌తో పెద్దల గూగుల్‌ ఖాతా వివరాలను ఇచ్చి అందులోనే లింక్‌ చేస్తూ చిన్నారులకు ప్రత్యేకంగా ఐడీ క్రియేట్‌ చేయొచ్చు. దీంతో చిన్నారుల అసలు వివరాలనే తెలుపుతూ ఒక ఐడీ తయారు చేయవచ్చు.

ఇక ఇలా చేసిన ట్యాబ్‌ లేదా ఫోన్‌లో ఇంకొక మేయిల్‌ ఐడీని క్రియేట్‌ చేయడానికి పిల్లలకు వీలు ఉండదు. దీంతో పాటు వారు ఆ మొబైల్‌లో ఎలాంటి యాప్‌లు వాడవచ్చని పెద్దల ఫోన్‌ నుండే గూగుల్‌కు సూచనలు ఇవ్వ వచ్చు అంతే కాకుండా చిన్నారుల వయసును బట్టి గూగుల్‌ వారికి తగ్గ కాంటెంట్‌, యాప్‌లను మాత్రమే అందుబాటులో ఉంచుతుంది. అంతే కాకుండా చిన్నారులు ఇంటర్నెట్‌లో ఏవైనా శోదించినా అందులో వారి వయసుకు మించిన సమాచారం రాదు. అలాగే అంతర్జాలంలోని అశ్లీల వెబ్‌సైట్లు వంటివి అస్సలే కనపడే అవకాశం ఉండదు. వీటితో పాటు చిన్నారులు ఆ మొబైల్‌ లేదా ట్యాబ్‌లో ఏదైనా కొత్త యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలన్నా పెద్దల అనుమతి తప్పనిసరిగా అడుగుతుంది. అలాగే వారు వాడుతున్న అన్ని వివరాలను పెద్దలు అనుక్షణం పర్యావేక్షించవచ్చు. అంతే కాదు చిన్నారులు ఏ సమయం నుండి ఏ సమయం వరకు నెట్‌ వాడాలో కూడా సూచనలు చేయొచ్చు.logo