శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 22:25:30

వలస కూలీలకు హెల్ప్ లైన్ నంబర్లు..

వలస కూలీలకు హెల్ప్ లైన్ నంబర్లు..

నిజామాబాద్ : ఇతర రాష్ర్టాలు, ప్రాంతాలకు చెందిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారు కంట్రోల్‌ రూమ్‌లో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు..

కామారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్‌ శరత్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెల్ప్‌లైన్‌ నంబర్లను 7382928649, 7382929350 ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి తమ వివరాలను తెలపాలని సూచించారు. 

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో 08462 -220183 నంబరును ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తెలిపారు. వలస కూలీల ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారు. 

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో 18004251939 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేశారు.


logo