గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 14:20:52

టీవీ రంగ కార్మికుల‌కు సాయం

టీవీ రంగ కార్మికుల‌కు సాయం

క‌రోనా విల‌య‌తాండ‌వానికి వ‌ణికిపోతున్న టీవీ రంగ కార్మికుల‌కు తెలుగు టెలివిజ‌న్ ర‌చ‌యిత‌ల సంఘం అండ‌గా నిలుస్తున్న‌ది. సంఘం త‌ర‌ఫున వారికి నిత్యావ‌స‌రాలు అంద‌జేస్తున్న‌ది.

తెలుగు టెలివిజ‌న్ ర‌చ‌యితల సంఘం కార్యాల‌యంలో కార్మికుల‌కు చ‌క్కెర‌, బియ్యం, ప‌ప్పు, నూనె త‌దిత‌ర వంట సామ‌గ్రి అందించారు. టీవీ రంగానికి చెందిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌, ప్రొడ‌క్ష‌న్ విభాగాల‌కు చెందిన 54 మంది కార్మికుల‌కు నిత్య‌వ‌స‌ర సామ‌గ్రి అందించారు. అలాగే బుధ‌వారం లోపు టీవీ ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 70 మంది మ‌హిళ‌ల‌కు రూ. 500 చొప్పున న‌గ‌దు అందించ‌నున్న‌ట్లు తెలుగు టెలివిజ‌న్ ర‌చ‌యిత‌ల సంఘం తెలిపింది.


logo