శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 03, 2020 , 02:30:52

మేడారానికి హెలికాప్టర్‌ సేవలు

మేడారానికి హెలికాప్టర్‌ సేవలు
  • ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మేడారం జాతరకు హెలికాప్టర్‌ సేవలను ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం బేగంపేట్‌ నుంచి మేడారం మధ్య హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చా మన్నారు.  హైదరాబాద్‌ నుంచి ఆరుగురు ప్రయాణించేందుకు రూ.1.80 లక్షలు (జీఎస్టీ అదనం) నిర్ణయించామని, జాతర ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఒక్కొక్కరికి రూ.2,999 చొప్పున అవుతుందన్నారు. రాష్ట్ర పౌర విమానయానశాఖ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి మాట్లాడుతూ.. హెలికాప్టర్‌ సేవల కోసం ఇప్పటికే బుకింగ్‌ ప్రారంభమైందని, 9400399999/ 94477 77110 నంబర్లలో లేదా www.helitaxi.com ద్వారా ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం ఎండీ మనోహర్‌ పాల్గొన్నారు.


logo