మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 19:58:23

విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జాం

విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌ : విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్‌ జాం అయింది. రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో రహదారులపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వాహనాల రద్దీతో హైవేపై ట్రాఫిక్‌ జాం ఏర్పడుతుంది. టోల్‌ప్లాజాలు దాటేప్పుడు ఈ రద్దీ ఇంకా విపరీతంగా ఉంటోంది. 

ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాల రద్దీ దృష్ట్యా సిబ్బంది టోల్‌ప్లాజాలో 6 లేన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 12 వేల వాహనాలు టోల్‌ప్లాజాను దాటినట్లుగా సమాచారం. భారీ ట్రాఫిక్‌ జాంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

VIDEOS

logo