శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 14:34:47

ఎన్‌హెచ్‌-65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ఎన్‌హెచ్‌-65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ :  క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో భారీ వర్షం కురిసింది. వారం క్రితం వాయుగుండం ప్రభావంతో కురిసిన కుండపోత వర్షానికి మహానగరాన్ని వరద ముంచెత్తడంతో ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మరోసారి కురిసిన వర్షానికి ముంపు ప్రాంత ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి.

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద జాతీయ రహదారిపై  వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విజయవాడ -హైదరాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ భారీగా స్తంభించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.