సోమవారం 13 జూలై 2020
Telangana - May 24, 2020 , 22:14:23

ఉప్పరిగూడెంలో భారీ చోరీ

ఉప్పరిగూడెంలో భారీ చోరీ

సుజాతనగర్‌: ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు రూ.7.80 లక్షలు అపహరించిన ఘటన శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం ఉప్పరిగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పరిగూడేనికి చెందిన రాంచందర్‌ అనే వ్యక్తి మంచిర్యాలలోని సింగరేణి ఏరియాలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. రాంచందర్‌ ఈ నెల 15వ తేదీన తన సొంత ఊరైన ఉప్పరిగూడెం గ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చాడు.  

ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి డాబాపై నిద్రించాడు. ఆదివారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో రూ.7.80 లక్షల అపహరణకు గురైనట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా సీఐ అశోక్‌, ఎస్సై శ్రీనివాస్‌ ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌లు తనిఖీ చేయించి వివరాలు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.logo