e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News హైద‌రాబాద్‌లో ఆగ‌ని ముసురు.. 17.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

హైద‌రాబాద్‌లో ఆగ‌ని ముసురు.. 17.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

హైద‌రాబాద్‌లో ఆగ‌ని ముసురు.. 17.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్‌ను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న‌టి నుంచి న‌గ‌రంలో ప్రారంభ‌మైన ముసురు ఆగ‌డం లేదు. విరామం లేకుండా ముసురు ప‌డుతుండ‌టంతో న‌గ‌ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బుధ‌వారం రోజు న‌గ‌రంలో 17.7 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదు కాగా, అత్య‌ధికంగా కాప్రాలో 30.5 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. హ‌య‌త్‌న‌గ‌ర్‌, ఆసిఫ్‌న‌గ‌ర్‌, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్‌, ఉప్ప‌ల్‌లో రాత్రంతా వ‌ర్షం కురిసిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. గురువారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు న‌గ‌రంలో 22.6 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఐఎండీ ప్ర‌కారం.. గురువారం అంతా న‌గ‌రంలో మోస్త‌రు వ‌ర్షాలు కురియ‌నున్నాయి. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంది. ఇక తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో రాత్రంతా భారీ వ‌ర్షాలు కురిశాయి. న‌ర్సాపూర్‌లో 233.5 మి.మీ. వర్ష‌పాతం న‌మోదైంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వ‌ర్షాలు కురిశాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హైద‌రాబాద్‌లో ఆగ‌ని ముసురు.. 17.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు
హైద‌రాబాద్‌లో ఆగ‌ని ముసురు.. 17.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు
హైద‌రాబాద్‌లో ఆగ‌ని ముసురు.. 17.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

ట్రెండింగ్‌

Advertisement