e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News తెలంగాణ‌లో ఇవాళ భారీ వ‌ర్షాలు!.. హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే

తెలంగాణ‌లో ఇవాళ భారీ వ‌ర్షాలు!.. హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే

తెలంగాణ‌లో ఇవాళ భారీ వ‌ర్షాలు!.. హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే

హైద‌రాబాద్ : తూర్పు విద‌ర్భ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. స‌ముద్ర మ‌ట్టానికి 4.5 కిలోమీట‌ర్ల ఎత్తున ఉప‌రితల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. దీంతో రాష్ర్టంలో గురు, శుక్ర, శ‌నివారాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ ఉత్త‌ర‌, ప‌శ్చిమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్న‌ది. రేపు, ఎల్లుండి కూడా కొన్ని జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో భారీ వ‌ర్షం కురిసింది. అయితే గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ వ్యాప్తంగా 26.77 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే మూడు రెట్లు అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది. సాధార‌ణ వ‌ర్ష‌పాతం 9.9 మి.మీ. మాత్ర‌మే. బుధ‌వారం కురిసిన వ‌ర్షానికి 20 మండ‌లాల్లో 100 మి.మీ. కంటే ఎక్కువ‌గా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

- Advertisement -

సహాయం కోసం కాల్‌ చేయండి
భారీ వర్షాలకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్ఎఫ్ ( Disaster Response Force ) బృందాలు, ఇత‌ర అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో స‌మ‌స్య‌లు ఎదురైతే.. 100కు లేదా 040-29555500 నంబ‌ర్ల‌కు కాల్ చేయాల‌ని న‌గ‌ర పౌరుల‌కు కేటీఆర్ సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ‌లో ఇవాళ భారీ వ‌ర్షాలు!.. హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే
తెలంగాణ‌లో ఇవాళ భారీ వ‌ర్షాలు!.. హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే
తెలంగాణ‌లో ఇవాళ భారీ వ‌ర్షాలు!.. హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే

ట్రెండింగ్‌

Advertisement