e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News రాగ‌ల 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!

రాగ‌ల 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!

రాగ‌ల 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో రాగ‌ల 48 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల‌తో పాటు రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన మోస్త‌రు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.

హైద‌రాబాద్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి చిరుజ‌ల్లులు కురుస్తున్నాయి. ఉప్ప‌ల్, అల్వాల్, రాజేంద్ర‌న‌గ‌ర్, కార్వాన్ ఏరియాల్లో ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు 0.5 మి.మీ. నుంచి 2 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం న‌మోదైంది. బాచుప‌ల్లిలో ఉద‌యం 10 గంట‌ల‌కు భారీ వ‌ర్షం కురిసింది.

- Advertisement -

హైద‌రాబాద్‌ న‌గ‌రంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. నిన్న‌టి వ‌ర‌కు న‌గ‌రంలో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్ల తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్ల‌డించింది. జులై 20వ తేదీ వ‌ర‌కు 359.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. ఈ తేదీ వ‌ర‌కు సాధార‌ణ వ‌ర్ష‌పాతం 210.9 మి.మీ. మాత్ర‌మే. ఐఎండీ డాటా ప్ర‌కారం.. జులైలో నెల‌లో 285.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, గ‌త ప‌దేళ్ల‌లో ఇదే అత్య‌ధిక‌మ‌ని వెల్ల‌డించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాగ‌ల 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!
రాగ‌ల 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!
రాగ‌ల 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!

ట్రెండింగ్‌

Advertisement