గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 14, 2020 , 17:09:52

రాగ‌ల మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

రాగ‌ల మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

హైద‌రాబాద్ : రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వాతావ‌ర‌ణ సూచ‌న చేసింది. ఉత్త‌ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం కొన‌సాగుతోంది. రాగ‌ల 3 రోజులు అక్క‌డ‌క్కడ తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ప‌లు జిల్లాల్లో ఒక‌ట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. గ‌త రెండు మూడు రోజుల నుంచి రాష్ర్టంలో ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం విదిత‌మే. చెరువులు, జ‌లాశ‌యాలు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.


logo