సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 14:45:57

రాగ‌ల 24 గంట‌ల్లో రాష్ర్టంలో వ‌ర్షాలు!

రాగ‌ల 24 గంట‌ల్లో రాష్ర్టంలో వ‌ర్షాలు!

హైద‌రాబాద్ : ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కేంద్రీకృత‌మైంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్టంలో రాగ‌ల 24 గంట‌ల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మంతో పాటు న‌ల్ల‌గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. గురువారం నుంచి వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.