శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 16:51:39

మ‌రి కొద్ది గంట‌ల్లో ఆ 9 జిల్లాల్లో భారీ వ‌ర్షం

మ‌రి కొద్ది గంట‌ల్లో ఆ 9 జిల్లాల్లో భారీ వ‌ర్షం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి. కుండ‌పోత వాన‌ల‌కు రాష్ర్టం త‌డిసి ముద్దైంది. హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. మ‌రి కొద్ది గంట‌ల్లో రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, యాదాద్రి, న‌ల్ల‌గొండ‌, సిద్దిపేట‌, సంగారెడ్డి, మెద‌క్‌, జ‌న‌గామ‌లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. 

రాష్ర్టంలో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు జ‌న‌గామలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, సాయంత్రం స‌మ‌యానికి న‌ల్ల‌గొండ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. 

ఉద‌యం 8:30 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు న‌ల్ల‌గొండ జిల్లాలోని త్రిపురారం మండ‌లం కామ‌రెడ్డిగూడెంలో అత్య‌ధికంగా 138.8 మిల్లిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, యాదాద్రి జిల్లాలోని గుండాల‌లో 133.8 మి.మీ., న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో 130.8 మి.మీ., న‌ల్ల‌గొండ జిల్లా మాడ్గుప‌ల్లిలో 124.8 మిల్లిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 


logo