మంగళవారం 19 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 07:22:35

రాష్ట్రంపైనా నివర్‌ ప్రభావం.. అక్కడక్కడ భారీ వర్షాలు!

రాష్ట్రంపైనా నివర్‌ ప్రభావం.. అక్కడక్కడ భారీ వర్షాలు!

హైద‌రా‌బాద్: నివర్‌ తుఫాన్‌ ప్రభావం తెలం‌గా‌ణ‌పైనా ఉంటుం‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడ‌క్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొన్నది. ప్రధా‌నంగా నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, వన‌పర్తి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నారా‌య‌ణ‌పేట్‌, జోగు‌లాంబ గద్వాల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లా‌ల్లోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి‌భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. రంగా‌రెడ్డి, మేడ్చల్‌, హైద‌రా‌బాద్‌, యాదాద్రి జిల్లాల్లో ఒకటి రెండు‌చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. 


నివర్‌ తుఫాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరందాటిన తర్వాత అతి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారిందని వెల్లడించింది. నివర్‌ ప్రభావంతో పుదుచ్చేరితోపాటు, తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తుండటంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. దీంతో తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.