శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 10:35:39

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వాన‌లు

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వాన‌లు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో నేడు, రేపు భారీ వాన‌లు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. జార్ఖండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో 1.5 కి.మీ. నుంచి 7.6 కి.మీ. మ‌ధ్య ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతున్న‌ద‌ని, దీని ప్ర‌భావంతో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన‌లు కురుస్తాయ‌ని తెలిపింది. ఈ రోజు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఒక‌టి రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వెల్ల‌డించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మూడు రోజులపాటు మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. 

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని భ‌ద్రాచ‌లం, చ‌ర్ల‌, దుమ్ముగూడెం, బూర్గంప‌హాడ్ మండ‌లాల్లో ఉద‌యం నుంచి వాన‌లు కురుస్తున్నాయి.


logo