శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 07:08:36

నేడు రాష్ట్రంలో కొన్నిచోట్ల అతిభారీ వ‌ర్షాలు

నేడు రాష్ట్రంలో కొన్నిచోట్ల అతిభారీ వ‌ర్షాలు

హైద‌రా‌బాద్: ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం అల్ప‌పీ‌డనం ఏర్ప‌డింద‌ని, అది సోమ‌వారానికి మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. దీనికి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. ఈ ప్రభా‌వంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అదేవిధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరి‌ధి‌లోనూ గంటకు 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లు‌లతో కూడిన తేలి‌క‌పాటి జల్లులు కురుస్తాయ‌ని వెల్లడించింది.  


logo