శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 12:18:24

తెలంగాణలో దంచికొట్టిన వాన..

తెలంగాణలో దంచికొట్టిన వాన..

హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల వరద ధాటికి రోడ్లు తెగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఉరుములు, మెరుపులుతో వర్షం పడింది. వేములవాడలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారులు పునరావాస చర్యలు చేపట్టారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఒగ్గు మల్లేశం కు చెందిన 30 గొర్రెలు పిడుగు పాటుకు మృత్యువాత పడ్డాయి. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శివారు కాలనీలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని నల్ల వాగు పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది.

జగిత్యాల జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో..
logo