సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 17:09:07

పాత‌బ‌స్తీలో భారీ వ‌ర్షం..

పాత‌బ‌స్తీలో భారీ వ‌ర్షం..

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో శుక్ర‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేర‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. చార్మినార్‌, జూపార్క్, బ‌హ‌దూర్‌పురా, పురానాపూల్‌, దూద్‌బౌలి, రాజేంద్ర‌న‌గ‌ర్‌, శివ‌రాంప‌ల్లి, అత్తాపూర్‌, గండిపేట‌, కిస్మాత్‌పూర్‌, శంషాబాద్‌, గ‌గ‌న్‌ప‌హాడ్‌లో వ‌ర్షం ప‌డింది. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. జీహెచ్ఎంసీ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి న‌గ‌రంలో వాన‌లు దంచికొడుతున్న విష‌యం తెలిసిందే.


logo