ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 10:38:47

నిర్మ‌ల్ జిల్లాలో భారీ వాన‌లు.. నిండిన గ‌డ్డెన్నవాగు ప్రాజెక్టు

నిర్మ‌ల్ జిల్లాలో భారీ వాన‌లు.. నిండిన గ‌డ్డెన్నవాగు ప్రాజెక్టు

నిర్మ‌ల్‌: ‌జిల్లాలో ప‌లు మండ‌లాల్లో నిన్న‌రాత్రి నుంచి ఎడ‌తెర‌పి లేకుండా వాన‌లు కురుస్తున్నాయి. దీంతో పాల్సిక‌ర్ రంగారావు ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరుతున్న‌ది. వాగులు పొంగిపొర్లుతుండ‌టంతో భైంసా నుంచి మ‌హాగామ్‌, పార్డి (బీ) గ్రామాల మ‌ధ్య‌ రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. 

భారీ వ‌ర్షాల‌తో వ‌ర‌ద‌ నీరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో భైంసా ఆటోన‌గ‌ర్ వంతెన వ‌ద్ద ఓ యువ‌కుడు గ‌ల్లంత‌య్యాడు. నీటి ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉంటంతో నీటిలో కొట్టుకుపోయాడు. 

నిండిన గ‌డ్డెన్నవాగు ప్రాజెక్టు

భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో జిల్లాలోని గ‌డ్డెన్నవాగు ప్రాజెక్టు నీటిమ‌ట్టం పూర్తిస్థాయికి చేరింది. ఎగువ నుంచి వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో ప్రాజెక్టులో భారీగా వ‌ర్ష‌పు నీరు చేరుతున్న‌ది. దీంతో అధికారులు మూడు గెట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల‌చేశారు. ప్రాజెక్టులోకి 11 వేల క్యూసెక్కుల నీరు వ‌స్తుండ‌గా, అంతే నీటిని వ‌దులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమ‌ట్టం 358.7 మీట‌ర్లు కాగా, ప్ర‌స్తుతం 358.60 మీట‌ర్లు నీరు నిల్వ‌ ఉన్న‌ది.  


logo