e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News నిర్మ‌ల్‌లో దంచికొట్టిన వాన‌.. న‌ర్సాపూర్‌లో 245 మి.మీ. వ‌ర్ష‌పాతం

నిర్మ‌ల్‌లో దంచికొట్టిన వాన‌.. న‌ర్సాపూర్‌లో 245 మి.మీ. వ‌ర్ష‌పాతం

నిర్మ‌ల్‌లో దంచికొట్టిన వాన‌.. న‌ర్సాపూర్‌లో 245 మి.మీ. వ‌ర్ష‌పాతం

నిర్మ‌ల్ : తెలంగాణ అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌లాశ‌యాల‌కు వ‌ర‌ద పోటెత్తింది. గ‌డిచిన 24 గంట‌ల్లో నిర్మ‌ల్ జిల్లాలో వాన దంచికొట్టింది. ఆ జిల్లాలోని న‌ర్సాపూర్‌లో అత్య‌ధికంగా 245 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. తెలంగాణ వ్యాప్తంగా 44.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, ఆదిలాబాద్, నిర్మ‌ల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్య‌ధికంగా 115.5 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. ఒక్క నిర్మ‌ల్ జిల్లాలోనే 204 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జూన్ 1వ తేదీ నుంచి జులై 22 వ‌ర‌కు రాష్ర్ట వ్యాప్తంగా 474.3 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదు అయింది.

నిర్మ‌ల్‌లో దంచికొట్టిన వాన‌.. న‌ర్సాపూర్‌లో 245 మి.మీ. వ‌ర్ష‌పాతం

ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి ప‌ర్యటించారు. నిర్మల్ పట్టణంలోని మంజూలాపూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ కాలనీల‌ను మంత్రి ప‌రిశీలించారు. జోరు వానలోనే ప‌లు కాల‌నీల‌లో ప‌ర్యటిస్తూ అధికారులకు సూచనలిస్తూ.. మంత్రి ప్రజలకు భరోసా క‌ల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్‌ చరిత్రలో ఎన్నడు కూడా ఇంత‌టి వ‌ర్షం కుర‌వ‌లేద‌న్నారు. ప‌లు కాల‌నీలు జ‌ల‌మయ్యాయ‌ని, ప్రజలు ఆందోళ‌న చెందొద్దని సూచించారు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు కూడా బాధితుల‌కు సహాయం చేయాల‌ని కోరారు. జిల్లా అధికారుల‌తో మంత్రి కలెక్టరేట్‌ కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వహించారు. ఈ వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వర్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముంద‌స్తు చర్చలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిర్మ‌ల్‌లో దంచికొట్టిన వాన‌.. న‌ర్సాపూర్‌లో 245 మి.మీ. వ‌ర్ష‌పాతం
నిర్మ‌ల్‌లో దంచికొట్టిన వాన‌.. న‌ర్సాపూర్‌లో 245 మి.మీ. వ‌ర్ష‌పాతం
నిర్మ‌ల్‌లో దంచికొట్టిన వాన‌.. న‌ర్సాపూర్‌లో 245 మి.మీ. వ‌ర్ష‌పాతం

ట్రెండింగ్‌

Advertisement