మంగళవారం 26 మే 2020
Telangana - May 16, 2020 , 14:35:04

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లో  ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, కార్వాన్‌,  తదితర ప్రాంతాల్లో కూడా   వాన పడింది.   ఖైరతాబాద్‌లో 3సెం.మీ వర్షపాతం నమోదైంది.   వర్షం కురిసిన చోట లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. 

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరాల మధ్య వాయుగుండం ఏర్పడింది. ఒడిశాలోని పారాదీప్‌కు 1100కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉంది. 


logo