గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 00:36:52

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

  • నేడు, రేపు ఓ మోస్తరు వానలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో/హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో సోమ,మంగళవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నారు. రాగల రెండ్రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.


logo