శనివారం 30 మే 2020
Telangana - May 07, 2020 , 16:49:33

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం..పొంగిపొర్లిన వాగులు

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం..పొంగిపొర్లిన వాగులు

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం, ఉపరితలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మోమిన్పేట్, నవాబుపేట్ మండలాల్లో జోరుగా వాగులు పారాయి. వరదకు అక్కడక్కడ రోడ్లు తెగిపోయాయి. దీంతో మోమిన్ పేట్- శంకర్ పల్లి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా కొల్చారం, చిలిపిచెడ్, మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.


logo