శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 11:52:12

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం.. ఇండ్ల‌లోకి వ‌ర‌ద నీరు

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం.. ఇండ్ల‌లోకి వ‌ర‌ద నీరు

వికారాబాద్‌ : జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి జిల్లాలోని నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. పంట పొలాలు మునిగిపోయాయి. రోడ్లపై నీరు పారుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

పెద్దేముల్‌ మండల పరిధిలోని ఇందూరు గ్రామం నీట మునిగిపోయింది. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి.. ఇండ్లలోకి నీరు చేరింది. ప్రధాన రోడ్లన్నీ వాగులు, కాలువల మాదిరి కనిపిస్తున్నాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉన్న బియ్యం, ధాన్యంతో పాటు ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. 

logo