గురువారం 02 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:40:12

రాష్ట్రమంతటా నైరుతి

రాష్ట్రమంతటా నైరుతి

  • అన్ని జిల్లాల్లో విస్తరించిన రుతుపవనం..
  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • రాష్ట్రంలో నేడు, రేపు భారీ వానలు..
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, అన్ని జిల్లాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెడ్ నాగరత్న వెల్లడించారు. నైరుతికితోడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని చెప్పారు. ఈ రెండింటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు. రాగల ఐదురోజులు గ్రేటర్ హైదరాబాద్ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


logo