e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home Top Slides రాష్ట్రమంతా కుండపోత

రాష్ట్రమంతా కుండపోత

  • 60 చోట్ల 7 నుంచి 20 సెం.మీ వర్షం
  • సహాయక చర్యలు ముమ్మరం
  • బంగాళాఖాతంలో అల్పపీడనం
రాష్ట్రమంతా కుండపోత

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: మూడురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయ్యింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్న చందంగా 24 గంటల వ్యవధిలోనే ఆరుచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 34 చోట్ల 12- 20 సెంటీమీటర్ల మధ్య, 20 చోట్ల 7- 12 సెంటీమీటర్ల మధ్య వర్ష పాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి మొదలైన వాన గురువారం రాత్రివరకు కూడా ఆగకుండా కురిసింది. గురువారం ఒక్కరోజే దాదాపు 15 మండలాల్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కేటీకే ఓసీపీ-2, ఓసీపీ-3లో రోజుకు 4,300 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. కాటారం మండలం పోతుల్‌వాయి సమీపంలోని బొప్పారం వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్‌ జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశారు. గార్ల మండలంలో చెక్‌డ్యాం పొంగి పాకాల ఏటికి అవతల వైపు ఉన్న రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నీటిమట్టం 30 అడుగులకు, రామప్ప చెరువు 31 అడుగులకు, వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు నీటమట్టం 21 అడుగులకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలోనూ భారీగా వర్షపాతం నమోదైంది సిద్దిపేట జిల్లాలోని శనిగరం, సింగరాయ ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్నాయి. మానేరు, మోయెతుమ్మద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బస్వాపూర్‌ వద్ద సిద్దిపేట- వరంగల్‌ మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి.

- Advertisement -

చేర్యాల-దానపంల్లి రహదారిలోని తాడూరు లోలెవల్‌ బ్రిడ్జ్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో చిట్యాల, తాడూరు, దానంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, పలుచోట్ల వంతెనలు తెగిపోయాయి. రోడ్లకు కోతపడింది. కొన్ని గ్రామాల్లో ఇండ్లు కూలాయి. నల్లగొండ జిల్లాలో జూలైలో సాధారణ వర్షపాతం 10.22 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 19.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 50 శాతం అధిక వర్షపాతం రికార్డయ్యింది.

రాష్ట్రమంతా కుండపోత
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ట్రమంతా కుండపోత
రాష్ట్రమంతా కుండపోత
రాష్ట్రమంతా కుండపోత

ట్రెండింగ్‌

Advertisement