మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 08:18:32

న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దు: జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌

న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దు: జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌

హైద‌రాబాద్‌: మ‌రో రెండు రోజుల‌పాటు హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల‌నుంచి బ‌య‌టికి రావ‌ద్ద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న్ లోకేష్‌కుమార్ సూచించారు. ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో న‌గ‌రంలోని ప‌లు చోట్ల రోడ్ల‌పై చెట్లు ప‌డిపోయాయ‌ని చెప్పారు. ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు వ‌ర‌ద ముంపున‌కు గుర‌య్యాయ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు, స‌హాయ‌క బృందాల‌తో వ‌ర‌ద స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. శిథిలావ‌స్థ‌కు చేరిన భవ‌నాలు, కొండ‌వాలు ప్రాంతాల‌వారు వెంట‌నే ఖాళీచేయాలని సూచించారు. ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు చేరుకోవాల‌ని సూచించారు. ఎలాంటి ఆస‌రా లేనివారికి క‌మ్యూనిటీ హాళ్ల‌లో తాత్కాలిక వ‌స‌తి క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo