మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 07:29:24

దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన

దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ : తెలంగాణను ఆనుకొని ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిన విషయం తెలిసిందే. ద్రోణి ప్రభావం కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతోంది. రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షానికి ఈ ఉదయం నుంచి తాండూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo