మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 06:50:41

నేడు నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన

నేడు నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ : వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం వర్షాలకు హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి పోటెత్తిన వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కార్వాన్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, మెహదీపట్నం, సికింద్రాబాద్‌, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, జూబ్లీహిల్స్‌, మూసాపేట్‌, కూకట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo