శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 09:29:32

శ్రీశైలం, సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో

శ్రీశైలం, సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో

నల్గొండ : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు వదులుతున్నారు. బుధవారం ఉదయం 2,50,459 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వస్తున్నది. దీంతో అధికారులు పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,99,309 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.4385 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కుడిగట్టులో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. 

సాగర్‌కు 3.42లక్షల క్యూసెక్కుల వరద

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 3,42,378 క్యూసెక్కుల భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.55 టీఎంసీల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.50 అడుగులకు వరకు నీరుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 3,42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo