ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 20:23:45

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ఖమ్మం : ఇతర ప్రాంతాల నుంచి గుట్కా ప్యాకెట్లు తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా దుకాణాలకు విక్రయిస్తున్న వ్యక్తిని ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మధిర మండలం అల్లినగారం గ్రామానికి చెందిన ఎలబండ కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది.

గురువారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు, ఎస్‌ఐ సతీశ్‌ కుమార్, మధిర పోలీసులతో కలిసి దుకాణాన్ని తనిఖీ చేసి రూ. ౩ లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా గన్నవరానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్ల చెప్పారని ఏసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి మధిర టౌన్  పోలీసులకు అప్పగించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.