గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 28, 2020 , 02:11:31

సాగర్‌కు భారీగా వరద

సాగర్‌కు భారీగా వరద

  • శ్రీశైలానికి 2.57 లక్షలక్యూసెక్కుల ఇన్‌ఫ్లో

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టికి వరద తగ్గుముఖం పట్టింది. లక్ష క్యూసెక్కులకుపైగా కొనసాగిన ఇన్‌ఫ్లో గురువారం సాయం త్రం 88వేల క్యూసెక్కులకు పడిపోయింది. జూరాలకు 1.70 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీశైలం జలాశయానికి మాత్రం రెండున్నర లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. నాగార్జునసాగర్‌కు 2,20,038 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1.37,038 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉన్నది. మరోవైపు గోదావరిలోనూ ఇన్‌ఫ్లోలు తగ్గుముఖం పట్టాయి. ఎల్లంపల్లికి ఆరు వేల క్యూసెక్కులకు పైచిలుకు వస్తున్నది. కాళేశ్వరం వద్ద  గురువారం సాయంత్రం సమయంలో 2,04,300 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. సరస్వతి బరాజ్‌కు మానేరు, గోదావరి నది నుంచి 15వేల క్యూ సెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా 8 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. లక్ష్మి బరాజ్‌కు ఎగువ నుంచి 1,96,850 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా 65 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు వదిలారు.  

తాజావార్తలు


logo