మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 08:52:59

జూరాల తీర గ్రామాల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

జూరాల తీర గ్రామాల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

మహబూబ్‌నగర్: ఎగువ‌న భార్షాలు కురుస్తుండ‌టంలో జూరాల‌కు భారీగా వ‌స్తున్న‌ది. దీంతో కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. ఎగువ‌నుంచి ప్రాజెక్టులోకి ఆరు లక్షలకు పైగా వ‌ర‌ద నీరు వ‌స్తున్న‌ది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండ‌టంతో అంతే మొత్తంలో నీటికి దిగువ‌కు విడుద‌ల చేస్తున్నార‌ని తెలిపారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండ‌టంతో పరివాహక ప్రాంతంలోని రైతులు, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సర్పంచులు, వీఆర్వో, వీఆర్ఏలు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారులు ఆదేశించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo