బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 12:34:07

తుంగభద్ర డ్యాంకు జోరుగా వరద

తుంగభద్ర డ్యాంకు జోరుగా వరద

జోగులాంబ గద్వాల : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద జోరు కొనసాగుతోంది. దీంతో నీటి మట్టం పెరుగుతుంది. ఎగువన  కురుస్తున్న వర్షాల కారణంగా టీబీ డ్యాంకు వరద పరవళ్లు తొక్కుతోంది. సోమవారం టీబీ డ్యాంకు లక్ష 16 వేల 827 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా, అవుట్ ఫ్లో 8,514 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 72.439 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రస్తుతం 1624.85 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. తుంగ డ్యాం నుంచి 49.261 క్యూసెక్కుల వరద టీబీ డ్యాంకు చేరుతుందని పేర్కొన్నారు.logo