శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 20:34:17

కృష్ణా నదికి భారీగా వరద

కృష్ణా నదికి భారీగా వరద

హైదరాబాద్‌ : కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లు గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు భారీగా వరద వస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం పెరింది. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.203 టీఎంసీలుగా ఉంది. 2లక్షల 52 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 25 గేట్ల ద్వారా లక్షా 92వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి చేరుతోంది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలంలో ఎడమ గట్టున జల ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీరు నాగార్జున సాగర్‌కు చేరుతోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo