సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 11:26:21

శ్రీశైలానికి పొటెత్తుతున్న వరద..

శ్రీశైలానికి పొటెత్తుతున్న వరద..

హైదరాబాద్‌ : శ్రీశైలానికి ఎగువ నుంచి వరద పొటెత్తుతోంది.  గంటగంటలకు ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.   ఎగువన కర్ణాకటలో భారీ వర్షాలు కురుస్తుండటం, తుంగభద్ర, జూరాల గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తుండటంతో భారీగా వరద వస్తోంది. ఈ ఉదయానికి  జలాశయానికి 6,53,302 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 33 అడుగుల మేర ఎత్తి దిగువ స్పిల్‌ వే ద్వారా 6 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో ఇంజినీర్‌ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  ముందు జాగ్రత్తగా ఇప్పటికే ప్రాజెక్టును సుమారు మూడు అడుగుల మేర ఖాళీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 882.3 అడుగులు ( 211.47 టీఎంసీలు) గా ఉంది. 


నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు18 గేట్లు ఎత్తివేత..  

 నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ ఉదయానికి జలాశయానికి 5,28,314 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు ప్రాజెక్టు 18 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా 4,91,370 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాల్వలకు 4 వేల క్యూసెక్కులు,  ప్రధాన జలవిద్యుత్‌ కేంద్ర ద్వారా 29,063 క్యూసెక్కులు, పవర్‌ హూజ్‌ ద్వారా 3575 క్యూసెక్కలు విడుదల చేస్తున్నారు. మొత్తంగా జలాశయం నుంచి 5,11,097 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగిస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.045  టీఎంసీలు) కాగా ప్రస్తుతం 588.8 అడుగులు (308.46 టీఎంసీలు) గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo